అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏం మాట్లాడిన సంచలనమే అని చెప్పాలి. ఆయన వ్యవహారశైలి అందరికంటే కాస్తా భిన్నంగా ఉంటుంది. జేసీ దివాకర్ రెడ్డి మనస్సులో ఏది కూడా దాచుకోరు .ఉన్నది ఉన్నట్లు మాట్లాడం ఆయన స్టైల్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా జేసీ దివాకర్ రెడ్డి తీరు అలానే ఉండేది. తరువాత టీడీపీ పార్టీలో చేరి చంద్రబాబును చాలామార్లు ఇరుకన పెట్టే మాటలు మాట్లడేవారు. సొంత పార్టీపైనే అనేక విమర్శలు చేసిన చరిత్ర జేసీ దివాకర్ రెడ్డిది. ఓటమెరుగని నేతగా రికార్డు సృష్టించిన జేసీ దివాకర్ రెడ్డి వంటి రాజకీయ నేత కూడా జగన్ ప్రభంజనం ముందు నిలబడలేకపోయారు. 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్ హవాలో జేసీ దివాకర్ రెడ్డి కూడా ఒటమిపాలైయ్యారు.

అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ను అనేక దుర్భాషలాడారు జేసీ బ్రదర్స్. వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత జేసీ బ్రదర్స్‌కు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. పలు కేసుల మీద ఇప్పటికే అరెస్ట్ అయ్యారు జేసీ సోదరులు. తాజాగా అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇటీవలే ముగిసిన పంచాయితీ ఎన్నికలపై స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతు… జనం డబ్బులకు అలవాటు పడ్డారని… టీడీపీ వారి దగ్గర డబ్బులు తీసుకుని జగన్‌కు ఓట్లు వేశారని చెప్పుకొచ్చారు జేసీ. జగన్ అభివృద్ది చేశాడా..? చంద్రబాబు అభివృద్ది చేశాడా అనేది జనాలకు అనవసరం అని వారికి డబ్బులు కావాలని చెప్పి ఓటర్లను తక్కవ చేసి చూపించూ ప్రయత్నం చేశారు.

ఇక కుప్పంలో కూడా టీడీపీ ఓడిపోవడంపై ఆయన స్పందించారు. బలహీనంగా ఎక్కడ ఉంటే అక్కడ పార్టీ ఓడిపోతుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కూడా తన పద్దతిని మార్చుకోవాలని ఆయన సూచించారు. పాత చింతకాయ పచ్చడితో ఎవడు తింటాడు.. నువ్వు బిర్యానీ పెట్టు కడుపు నిండా తినిపెడతాడని జేసీ చెప్పుకొచ్చారు. కొత్తతరం వచ్చినప్పుడు దానికి తగినట్లుగా మనం కూడా మారలని చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు. జగన్‌ను తట్టుకోవడం చంద్రబాబు వల్ల కాదని… నాకు తెలిసి పార్టీ పగ్గాలు వేరే వ్యక్తికి అప్పగించి .. కుప్పంపై చంద్రబాబు దృష్టిపెడితే బాగుంటుందని జేసీ చెప్పుకొచ్చారు. మరి జేసీ మాటలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.