టీడీపీ అధినేత చంద్రబాబును వరుస కష్టలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఓటమి భారంతో కృంగిపోయిన చంద్రబాబుకు వరుస షాకుల మీద షాకులిస్తున్నారు టీడీపీ నాయకులు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి కూడా చంద్రబాబుకు ఏది కలిసి రావడం లేదు. చంద్రబాబుకు కొన్ని వర్గాల్లో మంచి పేరుండేది. అయితే 2014లో సీఎం అయిన తరువాత ఆ పేరు కాస్తా పోయింది. అందుకే 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అంత దారణ ఓటమని చవి చూసింది. పైగా టీడీపీ నాయకుల్లో కూడా చంద్రబాబుకు విలువ లేకుండా పోయింది.

తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో చంద్రబాబుకు ఉన్న పరువు కూడా పోయింది. గత 35 ఏళ్లుగా చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో కూడా టీడీపీ దారుణ ఓటమిని చవిచూసింది. ఏ ఎన్నికలు జరిగిన కుప్పం ప్రజలు చంద్రబాబుకు అండగా ఉంటు వస్తున్నారు. అయితే గత రెండు సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి కూడా చంద్రబాబుకు మెజార్టీ తగ్గుతు వస్తుంది. ఇక పంచాయితీ ఎన్నికల్లో అయితే వైసీపీకి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది టీడీపీ. చంద్రబాబు కూడా కుప్పంను నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తుంది. చేసిన చేయకపోయిన మనకే ఓట్లు వేస్తారని ధీమాకు పోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

దీంతో చంద్రబాబు అక్కడ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే కుప్పంలో పర్యటించేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. పంచాయితీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. కుప్పం, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. అయితే ఊహించని విధాంగా చంద్రబాబుకు షాక్ ఇచ్చారు కుప్పం నేతలు. పలువురు కీలక నేతలు పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ ఓటమికి మీరంటే మీరే కారణమంటూ తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు నేతలు విమర్శలకు దిగుతున్నారు.

కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పీఎస్‌ మునిరత్నం రాజీనామా చేశారు. మునిరత్నంతో పాటు మరికొందరు నేతలు రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. చంద్రబాబు కుప్పంలో అడుగుపెట్టాక రత్నంతోపాటు ఇతర నేతలూ తమ లేఖల్ని అధినేత ముందు ఉంచబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి రాజీనామాను చంద్రబాబు అంగీకరిస్తారో లేదో చూడాలి. మొత్తనికి పంచాయితీ ఎన్నికలు కుప్పం టీడీపీలో ముసలం పుట్టించినట్లుగానే ఉన్నాయి.