ఢిల్లీ సీఎంగా మరోసారి అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు. ఆయన వరుసగా మూడోసాకి ఢిల్లీ సీఎంగా విజయం సాధించారు. గతంలో ఆయన
రెండుసార్లు ఢిల్లీ సీఎంగా పని చేశారు. తాజాగా ఆయన హట్రిక్ విజయం సాధించారు. కాకలు తీరిన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఓడించి మరి విజయం
సాధించారు కేజ్రీవాల్. కేజ్రీవాల్‌ను ఓడించడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్వశక్తులతో పోరాడినప్పటికి లాభం లేకుండా పోయింది. అరంవింద్ కేజ్రీవాల్ ఇంతటి
విజయం సాధించడం వెనుక ఏపీ సీఎం జగన్ హస్తం కూడా ఉంది. ఢిల్లీలో గెలిచిన కేజ్రీవాల్‌తో జగన్‌కు ఏం సంబంధం అనుకుంటున్నారా..? దీనిపై పూర్తి
వివరాల్లోకి వెళ్తే..

ఢిల్లీ సీఎంగా మరోసారి విజయం సాధించారు కేజ్రీవాల్. ఈ విజయం వెనుక ఓ వ్యక్తి దాగి ఉన్నారు. ఆ వ్యక్తి మరెవ్వరో కాదు… ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్
కిషోర్. అవును కేజ్రీవాల్ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ పడిన కష్టం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఢిల్లీ సీఎంగా రెండుసార్లు విజయం
సాధించిన కేజ్రీవాల్‌పై ప్రజల్లో కాస్తా అసంతృప్తి నెలకొంది. దీనిని పసి గట్టిన ప్రశాంత్ కిషోర్ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని చేరిపి వేయడానికి చాలా వ్యూహాలనే
రచించారు. ఏపీలో ఎటువంటి ఎన్నికలు ప్లాన్‌ను అమలు చేశారో , ఢిల్లీలో కూడా అటువంటి వ్యూహాలనే రచించి విజయం సాధించారు ప్రశాంత్ కిషోర్.
ఢిల్లీలో చదువుకున్న యువత ఎక్కువ, వారికి తగిన హామీలను ఇచ్చి వారిని పార్టీ పట్ల ఆకర్సితులై అయ్యేలా చేశారు. ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచిత
ప్రయాణం కల్పించి వారి ఓట్లను సైతం ఆప్ పార్టీకి పడేలా ప్లాన్ చేశారు ప్రశాంత్ కిషోర్.

ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ముందు మోదీ ,అమీత్ షా ప్లాన్‌లు ఏవి కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. గతంలో ఏపీలో కూడా ఇటువంటి వ్యూహాలనే
రచించారు ప్రశాంత్ కిషోర్. ఏపీలో వైసీపీ పార్టీ ఎన్నికల వ్యూహాకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. ఆయన అమలు చేసిన ప్లాన్‌తోనే జగన్ 151 సీట్లలో
విజయం సాధించగలిగారని చాలామంది నమ్ముతుంటారు. ఎన్నికల సమయంలోనే ప్రశాంత్ కిషోర్ , జగన్‌కు మిత్రుడిగా మారారు. ఇటీవలే ఏపీ రాజకీయల
గురించి మాట్లాడుతూ… జగన్ వ్య్తక్తిత్వం ఎలాంటిదో తెలిపారు ప్రశాంత్ కిషోర్. తాను ఇప్పటి వరకు పని చేసిన రాజకీయ నాయకుల్లో జగన్ లాంటి వ్యక్తిత్వం
కలిగిన మనిషిని చూడలేదని తెలిపారు.

ఆయనది చాలా దృఢమైన వ్యక్తిత్వం అని, దేనికి అంత తొందరగా లొంగిపోరని ఈ సందర్భంగా తెలిపారు ప్రశాంత్
కిషోర్. ప్రజలకు మంచి చేయలనే కసిని జగన్‌లో గమనించనని పేర్కొన్నారు ప్రశాంత్ కిషోర్. జగన్ తనకు మిత్రుడు కన్నా ఎక్కువే అని
చెప్పుకొచ్చారాయాన. ఈవిధాంగా ఇటు జగన్ విజయానికి, అటు కేజ్రీవాల్ విజయానికి ప్రత్యక్షంగా ఉండి పని చేశారు ప్రశాంత్ కిషోర్. ఈ విధాంగా కేజ్రీవాల్
విజయం వెనుక జగన్ సన్నిహితుడు అయిన ప్రశాంత్ కిషోర్ ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.