ఏపీ సీఎం జగన్‌పై గతంలో అనేక కుట్రలు జరిగాయని అందరికి తెలసిన విషయమే. గతంలో కుట్ర పన్ని మరి ఆయన్ను జైలుకు కూడా పంపించారు. గత
ఎన్నికల్లో జగన్ ఎట్టి పరిస్థుతుల్లో అధికారంలోకి రాకూడదని చాలామంది నాయకులు పని చేశారు. టీడీపీ , కాంగ్రెస్, జనసేన వంటి పార్టీలు జగన్
అధికారంలో రాకుండా అడ్డుకొవాలని చూసిన సంగతి తెలిసిందే. ఇక విశాఖ ఎయిర్ పోర్ట్‌లో అయితే ఏకంగా జగన్‌పై హత్య ప్రయత్నమే జరిగింది. తాజాగా
మరోసారి ఏపీ సీఎం జగన్‌పై కుట్ర జరుగుతుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జగన్ సీఎం అయిన దగ్గర నుంచి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినప్పటికి కూడా తాను అనుకున్నది అనుకున్నట్లు చేస్తున్నారు
జగన్. ప్రజలకు మంచి చేయలని నిరంతరం కృషి చేస్తున్నారు. ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపీలో పేద విద్యార్ధులకు కోసం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యానాన్ని చట్టంగా కూడా ఆమోదించింది
వైసీపీ ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రతి సంవత్సరం 15 వేలు కూడా ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీంతో ప్రభుత్వం పాఠశాలలో
చదివే విద్యార్థుల సంఖ్య గణణీయంగా పెరిగింది. ఈ విషయంలో జగన్ చాలమందికి నచ్చడం లేదు.

జగన్ నిర్ణయం కొన్ని కార్పోరెట్ కాలేజీలు, స్కూళ్ల యాజమాన్యాలకు నచ్చడం లేదు. కొందరు ఇప్పటికే జగన్‌పై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు.
ఎన్ని అడ్డంకులు వచ్చిన మొండిగానే ముందుకు వెళ్తున్నారు జగన్. ఇంగ్లీష్ విద్యా విధానంపై ఏకంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిపైనే విమర్శలు
చేశారు జగన్. దీంతో సహజంగానే అందరికి టార్గెట్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా జగన్ మీద అనేక ఫిర్యాదులు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
పవన్ కూడా ఇటీవలే బీజేపీతో కలిశారు. ఇలా శత్రువులు అందరు కలిసి ఒక్క జగన్‌పై పోరాటం చేస్తున్నారు. అయితే జగన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ
ఆలోచన మరోలా ఉంది. జగన్ మనతో దూరంగా ఏం లేడని భావిస్తోంది బీజేపీ. మనకు జగన్ అవసరం ఎంత ఉందో, జగన్ అవసరం కూడా మనకు అంతే
ఉందని బీజేపీ భావిస్తోంది. పైగా జగన్‌కు ప్రజల మద్దతు పూర్తిగా ఉందని అలాంటప్పుడు జగన్ విషయంలో మనం తొందరపడకూడదనే ఆలోచనలో ఉంది
కేంద్ర నాయకత్వం.

ఇటీవలే జగన్ వరుస ఢిల్లీ పర్యటనలు చేశారు. ఈ పర్యటనల్లో బీజేపీ నాయకులు కూడా జగన్‌ను ఏ రకంగానే ఇబ్బంది పెట్టింది లేదని అధిష్టాన వర్గాలు
చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికి జగన్ వెనుక ఏదో కుట్ర జరుగుతొందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు. మరికొందరేమో జగన్‌ను
టచ్ చేయడానికి బీజీపీ సైతం వణికిపోతోందని కామెంట్స్ చేస్తున్నారు.