టీడీపీ అధినేతకు పంచాయితీ ఎన్నికలు కొత్త సమస్యను తీసుకువచ్చాయి. ఇప్పటికే ప్రజల్లో పలచన అయిన టీడీపీ అధినేత తాజాగా తన సొంత నియోజికవర్గ ప్రజలకు కూడా భారంగా మారినట్లే కనిపిస్తున్నారు. గత 40 ఏళ్లుగా కుప్పం నియోజికవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. వైఎస్ఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన సందర్భంలోను అక్కడ ప్రజలు చంద్రబాబుకు మంచి మెజార్టీనే కట్టబెట్టారు. కనీసం ఆయన కుప్పంలో నామినేషన్ కూడా వేయడానికి రాకుండా అక్కడ ప్రజలు చంద్రబాబును గెలిపించారంటే ఎక్కడ ప్రజల్లో బాబుగారికి ఎలాంటి ఇమేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే వైఎస్ఆర్ తనయుడు వైఎస్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కుప్పంలో చంద్రబాబు హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి.2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు అధిక్యతు తగ్గతూ వస్తుంది. పైగా గత 40 ఏళ్లుగా కుప్పంగా పెద్దగా అభివృద్ది చెందింది కూడా లేదు. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రి అయినప్పటికి కుప్పంను అభివృద్ది చెందింది లేదు. చంద్రబాబు కనీసం కుప్పంను మున్సిపాలిటి క్రింద కూడా చేయలేకపోయారంటే ఆయన కుప్పంలో ఎలా చేశారో అర్థం చేసుకోవచ్చు.

అందుకే కుప్పం నియోజికవర్గంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో టీడీపీకి షాకిచ్చారు ప్రజలు. అక్కడ మెజార్టీ స్థానాలను అధికార వైసీపీ పార్టీయే కైవసం చేసుకుంది. గతంలో ఏ పార్టీ కూడా ఇన్ని పంచాయితీలను గెలిచింది లేదు. కుప్పంలో టీడీపీ ఓడిపోవడంతో టీడీపీ అధినేత షాక్‌కు గురైయ్యారు. దీంతో హూటాహుటిన మూడు పర్యటనకు కుప్పం బయలుదేరారు. అయితే గతంలో కుప్పంకు చంద్రబాబు బయలుదేరితే…. భారీ ఎత్తున స్వాగతం పలికేవారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆయన వచ్చారని తెలిసినప్పటికి ద్వితీయశ్రేణి నాయకులు ఎవరు కూడా చంద్రబాబుకు దగ్గరికి వెళ్లింది లేదు.

అధికారంలో ఉన్నప్పుడు వారిని పెద్దగా పట్టించుకోవలేదని… పైగా పంచాయితీ ఎన్నికల్లో సైతం తమను పక్కన పెట్టేశారని అభద్రత భావంతో టీడీపీ శ్రేణులు ఉన్నారు. చంద్రబాబు మండలలావారిగా నాయకులను కలుద్దామని అనుకున్నప్పటికి వారి నుంచి కూడా పెద్దగా స్పందన లేదని సమాచారం. చంద్రబాబు కుప్పం పర్యటనలో అడుగుడున అవమానాలు , అపశకునాలే ఎదురువుతున్నాయి.