టీడీపీ అధ్యక్షడు చంద్రబాబుకు టైం ఏమాత్రం బాలేదనే చెప్పాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబుకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. ఇక సొంత పార్టీ నేతలు గురించి వేరేగా చెప్పాలి. పార్టీ ఓడిపోందనే కారణంతో బాబుగారిని లైట్ తీసుకుంటున్నారు టీడీపీ నాయకులు. అప్పటి వరకు చంద్రబాబుని పొగిడిన వారి సైతం , ఇప్పుడు పార్టీని వీడుతుండటం విశేషం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో పాటు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు సైతం పార్టీని వీడుతున్నారు. మరికొందరు పార్టీని వీడటానికి రెడీగా ఉన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని జగన్‌కు జై కొట్టిన సంగతి అందరికి తెలిసిన విషయమే. మరి కొందరిని చంద్రబాబే కావాలనే బీజేపీలోకి పంపిస్తున్నారని టాక్ బాగా వినిపిస్తోంది. సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి తన బినామీలను ముందు జాగ్రత్తగా బీజేపీలోకి పంపించారు చంద్రబాబు. తాజాగా మరో టీడీపీ నేత బీజేపీలోకి వెళ్లడానికి రెడీగా ఉన్నారు. ఆ నేత మరెవ్వరో కాదు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే…

టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ ఓడిపోవడంతో మొదటి నుంచి టీడీపీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు గంటా. అధికారం ఎటు ఉంటే అటు వెళ్లే గంటా మొదట వైసీపీలో చేయలని ప్రయత్నాలు చేశారు. కాని గంటాకు చెక్ పెట్టారు ఎంపీ విజయ సాయి రెడ్డి. దీంతో గంటాకు వైసీపీలోకి గేట్లు మూసుకుపోయ్యాయి. దీనితో గంటా బీజేపీలో చేరడానికి గత కొద్ది రోజులుగా సన్నాహాలు చేసుకుంటున్నారు. కాని 5 సంవత్సరాలుకు ఒక్కసారి పార్టీలు మారే గంటా లాంటి వారిని పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి లేదు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడినట్లైయింది. చివరికి ఆయన వైసీపీలో చేరడానికే సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం.

దీని కోసం మొదట తన కార్యకర్తలను వైసీపీలోకి చేర్పిస్తున్నారట గంటా. ఇలా తనపై నమ్మకం కలిగిన తరువాతే పార్టీలో చేరికపై సీఎం జగన్‌తో చర్చించాలనే భావనలో గంటా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలువురి కార్యకర్తలను వైసీపీలోకి పంపించినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే అతి త్వరలోనే గంటా వైసీపీలోకి చేరడం ఖాయంగా కనిపిస్తొంది. ఒకవైపు తన రాకను వైసీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికి కూడా గంటా ప్రయత్నాలు మాత్రం అపడం లేదట. ఇప్పటికే అధికారం కొల్పోయి బాధపడుతున్న చంద్రబాబుకు మరో షాక్ ఇవ్వాడనికి రెడీ అయ్యారు గంటా. మరి రాబోవు రోజుల్లో గంటా శ్రీనివాస రావు ఏ పార్టీలో ఉంటారో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు.