ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మొదటిఘట్టం చివరి దశకు చేరుకున్నాయి. అయితే అభ్యర్థలు ప్రచారం కన్నా.. నిమ్మగడ్డ లేఖలే.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. చిన్న విషయాన్ని పెద్దగా చూస్తూ.. లేఖలు రాయడం.. విమర్శలు గుప్పిస్తూ.. గవర్నరుకు లేఖలు రాయడం.. అధికారాన్ని ధిక్కరిస్తున్నారని సీఎస్ కు బెదిరింపుల లేఖలు రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీ నేతలతో పాటు విపక్షాలు సైతం లేఖాస్త్రాన్ని సంధిస్తున్నాయి.

గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. వ్యవహార శైలిపై అధికార వైఎస్సార్ సీపీ పార్టీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో ఆయన మరో లేఖాస్ర్తం విడుదల సంధించారు. ఈ సారి మంత్రులను టార్గెట్ చేశారు. తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో ప్రవర్తనా నియమావళి సరిగ్గా అమలు కావట్లేదంటూ.. నిమ్మగడ్డ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యతను తాను గుర్తు చేయాల్సి వస్తోందని పేర్కొంటు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్కు లేఖ రాశారు.

తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో మంత్రులు పర్యటించకూడదని.. నిమ్మగడ్డ ఆదేశించారు. ఇది ఎన్నికల నియామవళి ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నిక్కచ్చిగా.. అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటున్నారు. తన జిల్లాల పర్యటన నేపథ్యంలో తొలి విడత ఎన్నికలు జరిగే.. పంచాయతీ పరిధిలో కోడ్ సక్రమంగా అమలు కావడం లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని.. ఎన్నికలు జరిగే ప్రాంతాలకు మంత్రులు.. ఎమ్మెల్యేలు… ప్రభుత్వ ఉద్యోగులు దూరంగా ఉండాలని ఆదేశించారు.

సాధారణ పారిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి.. ప్రవీణ్ ప్రకాశ్ ను తన ఆదేశాల మేరకు విధుల నుంచి తక్షణమే తొలగించాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి ఆదేశించారు. దీనిపై తాను ఇచ్చిన ఆదేశాలు ఇంతవరకు అమలు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రవీణ్ ప్రకాశ్ తన విధినిర్వహణలో విఫలం అయ్యారని.. ఆయన వల్లే.. ఎన్నికల షెడ్యూలును మళ్లీ కొత్తగా జారీ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తన ఆదేశాలు అమలు చేయకపోవడం చట్ట విరుద్ధమని.. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని నిమ్మగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు.