గత నాలుగు రోజులుగా ఏపీ రాజకీయాలు మొత్తం జగన్ ఢిల్లీ పర్యటనల చూట్టునే తిరుగుతోంది. ఒక్క రోజు వ్యవధిలో జగన్ రెండుసార్లు ఢిల్లీ వెళ్లారు.
మొదటి ప్రధాని మంత్రి మోదీతో భేటీ అయిన జగన్ తరువాత హో మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రయోజనాలు గురించి
చర్చించినట్లూ తెలుస్తోంది. ఇక మూడు రాజధానుల అంశం, ఏపీ శాసన మండలి రద్దు వంటి అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లూ సమాచారం.
ఏపీ హైకోర్టు కర్నూల్‌కు తరలింపు విషయంపై న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో కూడా చర్చించారు జగన్. ఢిల్లీలో అన్ని విషయాలను పూర్తి
చేసుకుని శనివారం ఢిల్లీ నుంచి ఏపీకి బయలు దేరారు.

ఇక విషయం పక్కన పెడితే… రాష్ట్ర అభివృద్ది కోసం జగన్ చేయని ప్రయత్నం లేదు. రాష్ట్ర అభివ‌ృద్ధి కోసం వివిధ కంపెనీలతో మాట్లాడి వారిని పెట్టుబడులకు
ఆహ్వానిస్తున్నారు మన సీఎం. తాజాగా జగన్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వివిధ కంపెనీలు ముందుకు
వచ్చాయి.అయిల్, గ్యాస్ ,రిఫైనరీలు ద్వారా రాష్ట్రంలో లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టబోతున్నాయి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు. రాష్ట రాజధానిని విశాఖకు
మార్చడంతో అక్కడ పలు కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ప్రముఖ ONGC సంస్థ విశాఖ, రాజమండ్రిలో సుమారు 78
వేల కోట్ల తమ కంపెనీ పెట్టుబడులను పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వంలతో ONGC సంస్థ చర్చలు చరిపినట్లూ
వార్తలు వస్తున్నాయి.

హిందుస్తాన్ పెంట్రోలియ్, గైయిల్ వంటి క్రూడ్ అయిల్‌కు చెందిని సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. హిందుస్తాన్
పెంట్రోలియ్, గైయిల్ భాగస్వామ్యంతో 32 వేల కోట్లతో కాకినాడలో గ్రీన్ ఫీల్డ్ పెట్రో కెమిక్ కాంపెక్స్‌ను ఏర్పాటు చేయనున్నాయి. హిందుస్తాన్ పెంట్రోలియ్
సంస్ధ విశాఖలో రిఫైనరీకు 27 కోట్లతో ఆధునికరణ పనులను చేపట్టింది. ఇలా ఏపీలో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం వెనక
సీఎం జగన్ పడిన కష్టం చాలా ఉందని అన్నడంతో ఎటువంటి సందేహం లేదు. ఏపీలో పెట్టుబడులు పెడితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, రాష్ట రెవ్యెన్యూ
కూడా బాగా పెరుగుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జగన్ ఇంతలా కష్టపడుతుంటే ,ప్రతిపక్షాలు మాత్రం జగన్ వల్ల పెట్టబడులు పెట్టడానికి వచ్చిన
కంపెనీలు వెనక్కి వెళ్లిపోతున్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారు.

హిందుస్తాన్ పెంట్రోలియ్, గైయిల్ ,ONGC వంటి ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడం చూసి చంద్రబాబు షాక్‌లో ఉన్నారు. తాను అధికారంలో
ఉన్నప్పుడు ఈ కంపెనీలను ఏపీలో పెట్టుబడులు పెట్టమని కోరగా , ప్రస్తుతం తమ కంపెనీలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం లేదని చెప్పి తప్పించుకున్నాయి.
కాని జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇదే కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడం విశేషం. మరి ఈ కంపెనీలపై చంద్రబాబు ఎలాంటి దుష్ప్రచారం
చేస్తారో చూడాలి. ఏది ఏమైనప్పటికి జగన్ సహకారంతో ఏపీకి మంచి రోజులు వచ్చాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.