అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఏపీ సీఎం జగన్‌కు ఓ విషయంలో చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ట్రంప్ ఇప్పుడు అమెరిక అధ్యక్షుడై అందరికి తెలిశాడు కాని , స్వాతహగా ఆయన రాజకీయ నాయకుడు కాదు. ట్రంప్ కుటుంబం మొదటి నుంచి వ్యాపారాలు చేసుకుంటూ ఉండేది. ట్రంప్ వాళ్ల నాన్నగారూ. వాళ్ల తాతగారూ కూడా వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ట్రంప్ కూడా వారి మాదిరిగానే వ్యాపార రంగలోకి వచ్చారు. ట్రంప్ అనేక వ్యాపార సంస్థలను స్థాపించి వాటిని విజయపథంలో నడిపించారు. వ్యాపార రంగంలో మంచి పేరు సంపాదించారు ట్రంప్. ఇలా అతి తక్కువ కాలంలోనే ఆయన చాలా ఉన్నత స్థితికి చేరుకున్నారు. ఆ తరువాత ఆయన మనస్సు రాజకీయాల వైపు మళ్ళీంది. దీంతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నిక అయ్యారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది కాని జగన్‌కు అమెరికా ప్రెసిడెంట్‌కు ఏం సంబంధం అనే కాదా మీ అనుమానం. వీరిద్దరిని ఓ కామన్ పాయింట్ కలుపోతుంది. మరి ఆ కామన్ పాయింట్ గురించి తెలుసుకోవాలి అంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే.

ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కాగానే మొదట ఆయన చేసిన పని గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాలపై సమీక్ష నిర్వహించడం. ఈ సమీక్ష ద్వారా ఒబామా ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో ఎటువంటి తప్పులు జరిగాయె వాటిని మొదటగా బయటపెట్టారు ట్రంప్. మేక్ అమెరికా గ్రేట్ అనే నినాదాన్ని నేత్తిన పెట్టుకున్నారు. దీని ద్వారా తమ మిత్ర దేశాలను సైతం గజ గజ లాడించారు. మిత్ర దేశాలు, శత్రు దేశాలు అని చూడకుండా అన్ని దేశాలకు వాణిజ్య అంక్షలు విధించారు ట్రంప్. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వాణిజ్య ఒప్పందాలపై సమీక్షలు నిర్వహించారు.

సరిగ్గా ఏపీ సీఎం జగన్ కూడా తాను అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాలపై సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రానికి నష్టం చేసే ఏ ఒప్పందాలను అయిన రద్దు చేస్తానని ప్రకటించారు జగన్. పోలవరంలో అక్రమాలు చేసిన వారి కాంట్రాక్టర్ల లైసెన్స్‌ను రద్దు చేశారు. ఇక రివర్స్ టెండరింగ్ పేరిట వందల కోట్ల ప్రజ ధనాన్ని ఆదా చేశారు. ఇలా ఏపీ సీఎం జగన్ , అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాము అధికారంలోకి రాగానే గత ప్రభుత్వంలో ఏమైన అన్యాయాలు, అక్రమాలపై సమీక్షలు నిర్వహించి ప్రజల సొమ్ముని కాపాడారు. కాకపోతే ట్రంప్ ఓ దేశానికి అధక్షుడు, జగన్ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంతే తేడా. వీరి ఆలోచలనలు మాత్రం ఒక్కటే.