ఇద్దరు ఏపీ మంత్రులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారట ఏపీ సీఎం జగన్. ఇంతకీ ఎవరా ఇద్దరు మంత్రులు ఏంటా కథ..?…దీనిపై పూర్తి వివరాల్లోకి
వెళ్తే….శాసన మండలిని రద్దు చేశారు ఏపీ సీఎం జగన్. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ప్రతి బిల్లును శాసన మండలి టీడీపీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో
ఏకంగా శాసన మండలిని రద్దు చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. సీఎం జగన తీసుకున్న ఈ నిర్ణయంతో ఇద్దరు మంత్రులు తమ పదవులు
కొల్పోవాల్సి వచ్చింది. ఇద్దరు మంత్రులు మరెవ్వరో కాదు .. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ. వీరిద్దరు ప్రస్తుతం జగన్ క్యాబినెట్‌లో
మంత్రులుగా కొనసాగుతున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ డిప్యూటీ సీఎంగా, మోపిదేవి వెంకట రమణ మర్కెటింగ్ శాఖ మంత్రిగా క్యాబినెట్‌లో ఉన్నారు.
తాజాగా జగన్ తీసుకున్న శాసన మండలి రద్దు నిర్ణయంతో వీరిద్దరు తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గత ఎన్నికల్లో వీరిద్దరు ఓటిమి పాలైయ్యారు. అయినప్పటికీ పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీకి, తనకు అండగా నిలిచారని కారణంతోనే శాసన మండలిలో
సభ్యత్వం కల్పించి వీరిద్దరికి క్యాబినెట్‌లో మంత్రి పదవులు అప్పగించారు. అయితే శాసన మండలిని రద్దు చేయడంతో వీరిద్దరు తమ పదవులు కొల్పోవాల్సి
వచ్చింది. వీరి మంత్రి పదవులు పోవడంపై సీఎం జగన్ క్యాబినెట్‌లో చర్చించినట్లూ సమాచారం. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు
అండగా ఉంటానని ఏపీ సీఎం వైఎస్ జగన్ హమీ ఇచ్చారు. మంత్రివర్గ సమావేశంలో జగన్ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టుగా సమాచారం అందుతోంది.

మంత్రివర్గ సమావేశం సోమవారం నాడు సీఎం జగన్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ఏపీ శాసనమండలిని రద్దు చేయలనే తీర్మానానికి కేబినెట్
ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణలకు తాను అండగా ఉంటానని ఏపీ సీఎం జగన్
ప్రకటించారు. మండలి రద్దైతే వీరిద్దరికి మరో రూపంలో పదవులను కల్పిస్తానని హమీ ఇచ్చారట జగన్. రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ ఎటువంటి నిర్ణయం
తీసుకున్న మాకు ఎటువంటి అభ్యంతరం లేదని క్యాబినెట్‌లో వీరిద్దరు చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ ఆదేశించిన వెంటనే తమ పదవులకు రాజీనామా
చేస్తానని తెలిపారట ఈ ఇద్దరు మంత్రులు. మరి తనకు అండగా నిలిచిన వీరిద్దరికి భవిష్యుత్తులో జగన్ ఎటువంటి పదవులు ఇస్తారో చూడాలి.