జ్వాలా గుత్తా… ఒకప్పుడు ఇండియాలోనే టాప్ బ్యాడ్మింటన్‌ స్థార్‌గా ఓ వెలుగు వెలిగింది. పలు టోర్నీలలో వరుస విజయాలను సాధిస్తూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. అయితే సడన్‌గా ఏమైందో ఏమో తెలియదు కాని ఆట మీద కన్నా వివాదాల మీదనే ఫోకస్ పెట్టింది ఈ భామ. దీంతో తరుచు మీడియాకు పెద్ద న్యూస్‌గా మారింది. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్‌పై కూడా పలుమార్లు వివాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది గుత్తా. ఇటీవలే భారత్ డబుల్స్‌లో నెంబర్ వన్ ప్లేయర్‌గా నిలిచింది. అమ్మడికి పెళ్లి మీద మనస్సు మళ్లీనట్లుంది. ఓ హీరోతో చాలాకాలంగా డేటింగ్ చేస్తుంది.దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే…

గుత్తా జ్వాలా గత కొంతకాలంగా ఓ తమిళ హీరోతో ఎఫైర్ సాగిస్తుందని కోలీవుడ్ మీడియాలో అనేక వార్తలు వెలువడుతున్నాయి. తమిళ హీరో రాక్షసన్ ఫేం విష్ణు విశాల్‌తో చాలా క్లోజ్‌గా ఉంటుంది గుత్తా జ్వాలా. అతనితో కలిసి చాలాసార్లు పబ్బులు, రెస్టారెంట్లు అంటూ తెగ తిరిగేస్తూ కెమెరా కంటికి చిక్కింది ఈ బ్యాడ్మింటన్ స్టార్. తాజాగా ఈ భామ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు విషయాలను షేర్ చేసుకుంది. మీరు తమిళ హీరో విష్ణు విశాల్‌తో డేటింగ్‌లో ఉన్నారా.? అని అడిగిన ప్రశ్నకు కాస్తా ఘాటుగానే సమాధానం ఇచ్చింది గుత్తా జ్వాలా. అవును నేను విష్ణు విశాల్‌తో ఎఫైర్‌లో ఉన్నాను, అయితే ఏంటీ ఇప్పుడని ఎదురు ప్రశ్నించింది. దీంతో ఆమె విష్ణు విశాల్‌తో లవ్‌లో ఉన్నారనేది కనఫర్మ్ ఇచ్చినట్లు అయింది. మేము ఇంకా రిలేషన్‌లోనే ఉన్నామని, పెళ్లి గురించి ఇంకా ఆలోచించలేదని చెప్పుకొచ్చింది. అయితే మా అభిప్రాయాలు ఒకేలా ఉండటంతోనే ఇద్దరి మధ్య రిలేషన్ సెట్ అయిందని తెలిపింది. ఇక మా బంధం పెళ్లి వరకూ వెళ్తుందో లేదో చూడాలని చెప్పి షాక్కించింది.

ప్రస్తుతనికి అయితే నేను విశాల్‌తోనే డేటింగ్ చేస్తున్నానని తెలిపింది ఈ హైదరాబాది బ్యాడ్మింటన్ స్టార్. నాకు తెలుగు ఇండస్ట్రీలో నితిన్ చాలా క్లోజ్ ఫ్రెండ్, అతని కోరితేనే గుండెజారి గల్లంతైయిందే సినిమాలో సాంగ్ చేశానని చెప్పింది గుత్తా. ఇక తనకు పలు జాతీయ పార్టీల నుంచి కూడా ఆహ్వానాలు వచ్చాయని కాని , నాకు రాజకీయలపై పెద్దగా ఆసక్తి లేదని తెలిపింది. కాని ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయలని ఉందని తెలిపింది. అప్పుడు పరిస్థితిని బట్టి ఏ రాజకీయ పార్టీ అయితే నాకు సెట్ అవుతుందో ఆ పార్టీలో చేరతానని తెలిపింది గుత్తా. సైనా నెహ్వాల్, పీవీ సింధులపై తనకు ఎటువంటి వ్యక్తిగత ధ్యేషం లేదని, వారికి మాదిరిగానే మా మీద కూడా ఫోకస్ పెడితే బాగుంటుందని చెప్పి పరోక్షంగా గోపిచంద్‌కు సెటైర్లు వేసింది. మొత్తనికి ఇలా తమిళ హీరో విష్ణు విశాల్‌ ఎఫైర్ సాగిస్తూ ఆటకు దూరంగా ఉంటుంది గుత్తా.